![]() |
![]() |
.webp)
అటు బుల్లితెర.. ఇటు వెండితెర.. ఏదైన సరే కథ, కథనం ముఖ్యం. అయితే వీటిల్లో రొమాన్స్ అండ్ ఐటమ్ సాంగ్స్ కి ఉండే క్రేజే వేరు. అలాగే ఇన్ స్టాగ్రామ్ లో పద్దతిగా చీరకట్టులో రీల్స్ చేసేవాళ్ళు, మరోవైపు బోల్ట్ లుక్ లో మిడ్డీలు, చెడ్డీలు వేసుకునేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే పాజిటివ్ రీల్స్ చేసేవాళ్ళ కంటే బోల్డ్ ఫోటోలు, రీల్స్ చేసేవాళ్ళకే డిమాండ్ ఎక్కువ. కొందరు సరదా సరదాకే ఎక్స్ పోజింగ్.. మరికొంతమంది చిన్న తారలు దర్శక, నిర్మాతల కంట్లో పడడానికి ఎంతవరకైనా వెళ్తారు. ఆ జాబితాలోకి ఇప్పుడు దివి వాద్య చేరింది. హాట్ అండ్ బోల్డ్ పిక్ తో మరోసారి ఇన్ స్టాగ్రామ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఈ భామ.

దివి వాద్య.. ఈ పేరు ఇప్పుడు అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ 4 లో ఛాన్స్ కొట్టేసి మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ భామకి మంచి క్రేజ్ ఉంది. అంతే కాకుండా వరుస ఆఫర్స్ తో బిజీ గా ఉంటుంది. ఈమె ఇండస్ట్రీకి మొదటగా ఒక మోడల్ గా పరిచయం అయింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో వెండి తెర పై మెరుపు తీగలా అలా వచ్చి ఇలా వెళ్తుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది. అలా నక్క తోక తొక్కినట్లు వరుస ఆఫర్స్ తో బిజీ అయిపోయింది.

దివి వాద్య ఇటీవల చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో చేసి మెప్పించింది. ఇంకా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'భోలా శంకర్' మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ సొట్ట బుగ్గల సుందరి. అయితే దివి గతకొంత కాలం నుంచి తన ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫొటోస్ పెడుతూ యూత్ ని ఆకర్షిస్తోంది. అలా తను పోస్ట్ చేసిన ఆ ఫొటోస్ చూసిన కొందరు నెటిజన్లు.. నీ అందంతో చంపేస్తావా ఏంటిని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా తను పోస్ట్ చేసిన హాట్ ఫోటో వైరల్ గా మారింది. ఇలా తను ఎప్పటికప్పుడు హాట్ ఫొటోస్ తో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తుంది. దివి త్వరలో కవర్ సాంగ్స్, మరికొన్ని వెబ్ సిరీస్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల జీ-5లో విడుదలైన 'ఏటీఎమ్' వెబ్ సిరిస్ లో నటించిన దివి.. తన అందాలతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ భామని కొందరు నెటిజన్లు హీరోయిన్ మెటీరియల్ అని అంటున్నారు. మరి ఏ స్టార్ హీరో పక్కనైనా తనకి హీరోయిన్ గా ఛాన్స్ దక్కుతుందో లేదో చూడాలి మరి.
![]() |
![]() |